భయంకరమైన జంతువుల మధ్య అందాల నటి సదా.. !

నితిన్ హీరోగా నటించిన జయం సినిమా ద్వారా హీరోయిన్ గా టాలివుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ సదా. ఈ సినిమాలో సదా తన అందం, అభిప్రాయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. జయం సినిమాలో వెళ్లవయ్య వెళ్ళు అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా మంచి హిట్ అవటంతో తెలుగు, తమిళ్ భాషలలో వరుస సినిమా అవకాశాలు అందుకుంది. సదా నటించిన వీరభద్ర, అపరిచితుడు, ఔనన్నా కాదన్నా వంటి సినిమాలు మంచి హిట్ అయ్యాయి. అయితే సదా చాలాకాలంగా వెండి తెరమీద కనిపించటం లేదు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ అమ్మడు బుల్లితెర మీద మాత్రం సందడి చేస్తోంది.

ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో లో చాలా కాలం జడ్జ్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అంతే కాకుండా బుల్లితెర మీద ప్రసారమైన పలు టీవి షోలలో కూడా సందడి చేసింది. అంతే కాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా తరచు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల సదా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు,వీడియో వైరల్ గా మారాయి.

ఇటీవల ఈ అమ్మడు తన స్నేహితులతో కలిసి మధ్యప్రదేశ్‌లోని పెంచ్ నేషనల్ పార్కులో సఫారి రైడ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ తిరుగుతున్న పులులను తన కెమెరాలో బంధించి సఫారీ రైడ్‌కు సంబంధించిన విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. ఈ క్రమంలో పోస్ట్ షేర్ చేస్తూ.. తానూ బ్లాక్ పాంథర్ తో ప్రేమలో పడినట్లు తెలియచేసింది. హైదరాబాద్‌లో షూటింగ్ పనులతో బిజీగా ఉన్నప్పటికీ సమయం కేటాయించుకొని మరీ సఫారీ రైడ్ కోసం విమానంలో వెళ్లాలని నిర్ణయించుకుందట. పెంచ్‌కు చేరుకునే ముందు ఓ బ్లాక్‌ పాంథర్ సదా కంట పడింది. ఆతర్వాత నాలుగు సఫారీల్లో సదా ట్రిప్ ముగించుకుని తిరిగొస్తున్నప్పుడు మళ్లీ అది కనబడింది. దీంతో బ్లాక్ పాంథర్‌ను చూడగానే ప్రేమలో పడిపోయా’ అంటూ తన టూర్‌ విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.