డైరెక్టర్ మారుతితో రూ.10 వేలను అకౌంట్ లో వేయించుకున్న గోపీచంద్!

గోపీచంద్ తెలుగు చలనచిత్ర నటుడుగా అందరికీ సుపరిచితమే. యాక్షన్ చిత్రాలలో తన పాత్రలకు మంచి పేరు, గుర్తింపు పొందాడు. ఈయన చిత్ర నిర్మాత టీ.కృష్ణ యొక్క రెండవ కుమారుడు. ఈయన శ్రీకాంత్ మేనకోడలు రేష్మ ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం.

2001లో విడుదలైన తొలివలపు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు గోపీచంద్. ఆ తర్వాత జయం, నిజం, వర్షం సినిమాలలో విలన్ గా నటించి గుర్తింపు పొందాడు. ఈ మూడు చిత్రాల ద్వారా ఉత్తమ విలన్ గా నంది, సినిమా అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 2004లో యజ్ఞం సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమా మంచి విజయం తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో ముందుకు సాగుతున్న గోపీచంద్ ను యాక్షన్ స్టార్ ఇంకా మాకో స్టార్ అని ముద్దుగా పిలుస్తారు. గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా విడుదల సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అందులో మీరు మొదట సారి తీసుకున్న పారితోషకం ఎంత అనే ప్రశ్న ఎదురయింది.

అందుకు తాను జయం సినిమాకు 1100 రూపాయలు పారితోషకం తీసుకున్నట్లు తెలిపాడు. ఇక ఆ ఇంటర్వ్యూలో ఎవరితో ప్రాంక్ చేస్తారు అంటే తాను డైరెక్టర్ మారుతితో అంటూ ఫోన్ చేసి ప్రాంక్ ద్వారా పదివేల రూపాయలు అకౌంట్లో వేయించుకున్నాడు.

ఆ తరువాత మీరు ఎక్కువగా పారితోషకం తీసుకున్న సినిమా ఏది అనే ప్రశ్న ఎదురైంది.అందుకు తాను రెమ్యూనరేషన్ ఎంత అనేది చెప్పలేదు కానీ పక్కా కమర్షియల్ సినిమాకు మాత్రం కెరీర్ లోనే బెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలిపాడు. ఇక ఒక సినిమాకి సంతకం చేసి షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.