Childhood Photo: క్యూట్ లుక్స్ తో ఎంతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె స్టార్ హీరోయిన్?

Childhood Photo: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది అంటే సినీ సెలబ్రిటీల త్రో బ్యాక్ ఫోటోల హవా నడుస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలు అభిమానులకు బాగా దగ్గరవుతున్నారు.ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు కూడా అభిమానులను పెంచుకోవడం కోసం వారి చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు.ఇలా సెలబ్రిటీలు చిన్నప్పటి ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు ఆ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

తాజాగా ఒక సినీనటి చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గులాబి రంగు డ్రెస్ ధరించి రెండు జడలు వేసుకుని క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా? ఈమె ఎవరో గుర్తు పట్టాలంటే ఒక చిన్న క్లూ.. ఈమె నటించిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈమె నటించిన మొదటి సినిమా వందతో మొదలవుతుంది.

ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తొచ్చారా అవును మీరు అనుకున్నది నిజమే… ఈమె ఆర్ఎక్స్ 100 ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే బోల్డ్ లుక్ లో కనిపిస్తూ విశేషమైన ఆదరణ దక్కించుకున్న బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నేడు పుట్టిన రోజు జరుపుకోవడంతో ఈమె చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ క్రమంలోని అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులు ఈ బ్యూటీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.