RRR : వాళ్ళతో కలిసి పనిచేయడం కోసమైనా ఆర్ఆర్ఆర్ 2 తీస్తా…. ఎమోషనల్ గా మాట్లాడిన రాజమౌళి..!

RRR : దర్శకధీరుడు రాజమౌళి మాస్టర్ మైండ్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇంకా ఈ సినిమా ఫీవర్ విడుదలయి వారాలు గడుస్తున్నా ఇంకా తగ్గలేదు. ఈ సినిమా లో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. ఇద్దరు పోటీ పాడి నటించారు ఈ చిత్రంలో. వాళ్ళ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ను ఇచ్చారు. ఇక ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకుంది. ఈ అంశాలే సగటు ప్రేక్షకుడిని థియేటరుకు రప్పిస్తున్నాయి.

ఇక వసూళ్ల పరంగాను ఆర్ఆర్ఆర్ అందరిని ఆశ్చర్య పరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా మొత్తం రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క నిజాం ఏరియాలోనే ఏకంగా 100కోట్లు వసూలు చేసి ఇంకా వసూళ్లలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. ఇక నిజాం లో వసూళ్లలో మొదటి సినిమాగా నిలబడింది.ఇక బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. బాలీవుడ్ సినిమాలను తొక్కుకుంటూ పోతోంది. ఇక వసూళ్ల పరంగాను ఇప్పటికే టాప్ 5 ప్లేస్ లో ఉన్న ఆర్ఆర్ఆర్ ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.ఇక ఆర్ఆర్ఆర్ ఫుల్ గా సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా సక్సెస్ కు పార్టీ ఇచ్చారు ఇక హిందీలోను సక్సెస్ కు పార్టీ అనంతరం మీడియా సమావేశం జరిగింది. అందులో ఆర్ఆర్ఆర్ 2 గురించి ఎన్టీఆర్ ప్రస్తావించగా అందుకు రామ్ చరణ్ ముందు ఆర్ఆర్ఆర్ దండయాత్ర అయిపోని బ్రదర్ ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ 2 గురించి చూద్దాం..కానీ ఆర్ఆర్ఆర్ 2 రావాలని కోరుకుంటున్న అంటూ చెప్పారు.

ఇక రాజమౌళి స్పందిస్తూ ఆర్ఆర్ఆర్ కోసం 2020 లో అనుకుని 2022 వరకు అదే వత్తిడిలో ఉన్నానని కొంత గ్యాప్ కావాలని అయితే ఆర్ఆర్ఆర్ 2 ఖచ్చితంగా తీస్తానని సినిమా హిట్ అవ్వడం వసూళ్ళ కోసం కాదని కేవలం నా సోదరులు ఇద్దరితో కలిసి పనిచేయడం కోసం తీస్తానని చెప్పారు. వాళ్ళతో జర్నీ చాలా బాగుందని తెలిపారు. ఇక ఈ సక్సెస్ మీట్ లో అమీర్ ఖాన్ కూడా సందడి చేసారు.