బాక్సాఫీస్ : జపాన్ లో రికార్డులు ఏరేస్తున్న “RRR”..లేటెస్ట్ వసూళ్లు ఎంతంటే!

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న మన ఇండియన్ సినిమా అందులోని మన టాలీవుడ్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీ తెలిసిందే. దర్శక దిగ్గజుడు ఎస్ ఎస్ రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన ఈ భారీ ఏక్షన్ వండర్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మరో లెవెల్ రీచ్ అని అందుకొని దుమ్ము లేపుతుంది.

ఓ పక్క యూఎస్ లో మరో పక్క జపాన్ లో భారీ వసూళ్లతో తుక్కు రేగ్గొడుతున్న ఈ చిత్రం లేటెస్ట్ గా జపాన్ వసూళ్ల డీటెయిల్స్ బయటకి వచ్చాయి. మరి జపాన్ లో అయితే ఈ చిత్రం ఇప్పుడు అధికారికంగా బాహుబలి 2 ని దాటేసి రెండో ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ప్రస్తుతం అయితే ఏకంగా 305 జపాన్ యిన్స్ వసూలు చేసి రికార్డులు ఏరేస్తున్న ఈ చిత్రం 2 లక్షల 3 వేలకి పైగా ఫుట్ ఫాల్స్ తో ఇంకా స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది. మరి జపాన్ కరెన్సీ నుంచి మన ఇండియన్ వసూళ్ల లెక్కల్లో చూస్తే జపాన్ నుంచి RRR సినిమా 18 కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది.

దీనితో అయితే ఈ మార్క్ అందుకున్న ఫాస్టెస్ట్ సినిమాగా రికార్డు నెలకొల్పగా ఫైనల్ రన్ ఎలా ఉంటుందో అని ట్రేడ్ వర్గాల వారు చూస్తున్నారు. మరి ఈ భారీ సినిమాకి అయితే ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించారు.