చరణ్ ని మళ్ళీ పక్కన పెడుతున్న RRR టీం.?

Ram-Charan-Starrer-RRR-Heap-Praises-From-Hollywood

ఒకప్పుడు మన తెలుగు హీరోలు పాన్ ఇండియా లెవెల్ కి వెళ్తేనే అదే పెద్ద విషయం కానీ బిగ్ హిట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మాత్రం ఇద్దరు హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ఇద్దరు కూడా ఏకంగా గ్లోబల్ హీరోలు అయ్యారు. అయితే సినిమా రిలీజ్ అయ్యిన మొదటి రోజు నుంచి కూడా రామ్ చరణ్ డామినేషన్ క్లియర్ గా అందరికీ కనిపించింది.

పైగా సినిమాలో చరణ్ మెయిన్ హీరో అని అందరికీ అర్ధం అయ్యింది. కానీ అది అప్పటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేక రాజమౌళిని ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ఆడుకున్నారు. కానీ ఫైనల్ గా అయితే మళ్ళీ ఎన్టీఆర్ రోల్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చే సరికి జక్కన్న ని దేవుడన్నారు.

దీనితో ఆ సమయం నుంచే చిత్ర యూనిట్ టీం కూడా చరణ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గించినట్టే అనిపించింది. ఎవరైనా స్టార్స్ లాంటి వారు ఎన్టీఆర్ రోల్ ని ప్రశంసిస్తే వాటికి రీట్వీట్ లు కొట్టడం షేర్ చేయడం వంటివి చేశారు కానీ చరణ్ విషయంలో పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం క్లియర్ గా కనిపించింది.

అప్పుడు జేమ్స్ కెమరూన్ మాట్లాడిన దానిపై కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు అంతెందుకు రామ్ చరణ్ RRR సినిమా తరపునే యూఎస్ లో ఫేమస్ షో కి హాజరు అయ్యినప్పటికీ దానిపై కూడా మౌనం గానే ఉన్నారు. దీనితో క్లియర్ కట్ గా రామ్ చరణ్ విషయంలో వివక్షత చూపుతున్నారని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ RRR టీం పై గుస్సా గా ఉన్నారు.