ప్రతి ఫ్యాన్ కోరుకునే రెస్పాన్స్ విదేశీ గడ్డపై కొల్లగొట్టిన ‘RRR’.!

మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాస్ అభిమానులు సౌత్ లో ఇంకెక్కడా ఉండరని చెప్పాలి. మరి మన దగ్గర కూడా మాస్ హీరోస్ చాలా ఎక్కువ మంది కావడంతో సినిమా మొదటి రోజు అయినా అలాగే స్పెషల్ షోస్ కి అయినా కూడా అభిమానులు థియేటర్స్ లో ఆ వేడుకలు మాస్ గా చేసి వారు పేపర్ లు ఎగరేస్తే మళ్ళీ స్క్రీన్ కనిపించకూడదు ఇలాంటి సెలెబ్రేషన్స్ చూపించండి అంటూ సోషల్ మీడియాలో ప్రతి హీరో కామన్ గా మాట్లాడుకునే క్రేజీ అంశం.

మరి దీనిని అయితే ఈ ఏడాది ఇండియన్ సెన్సేషనల్ హిట్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) నిజం చేసి చూపించింది. అది మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే పొరపాటే.. ఇది విదేశీ గడ్డ జపాన్ లో జరిగిన ఆశ్చర్యకర అంశం. మరి అక్కడ ఈ చిత్రం రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.

లేటెస్ట్ గా అయితే చిత్ర యూనిట్ ఓ ఫోటో షేర్ చేసుకొని ప్రతి హీరో అభిమాని కోరుకునే అంశం మా ఎన్టీఆర్ రామ్ చరణ్ మరియు రాజమౌళి లు సినిమా RRR జపాన్ లో సాధించింది. అక్కడ థియేటర్స్ లో జపాన్ ఆడియెన్స్ పేపర్స్ ఎగరేస్తే స్క్రీన్ చిన్న ఇంచ్ కూడా కనిపించలేదు.

దీనితో ఈ క్రేజీ మూమెంట్ ని షేర్ చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు. మరి మన సినిమాకి ఎక్కడో జపాన్ లో ఇలాంటి క్రేజ్ దక్కడం అంటే విశేషం అనే చెప్పాలి.