సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ ప్రేమ గురించి ప్రపంచానికి తెలుసు. అవును.. వాళ్లిద్దరి మధ్య ఉన్న బాండ్ ఇప్పటిది కాదు. ఏడెనిమిదేళ్ల నుంచే కొనసాగుతున్న బాండ్. సుధీర్ కు రష్మీ అంటే పిచ్చి ప్రేమ. రష్మీకి కూడా సుధీర్ అంటే చాలా ఇష్టం. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని ప్రపంచమంతా కోడై కూస్తున్నా.. వాళ్లు మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపలేదు. కాకపోతే.. స్కిట్లలో, డ్యాన్స్ షోలలో అక్కడా ఇక్కడా కలిసి పార్టిసిపేట్ చేశారు తప్పితే.. తామిద్దరం లవ్ లో ఉన్నామని ఎప్పుడూ చెప్పలేదు.
కానీ.. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ 300వ ఎపిసోడ్ లో ఏకంగా జబర్దస్త్ జడ్జి రోజానే వీళ్ల లవ్ ట్రాక్ గురించి అడిగేసింది. సుధీర్ ను జబర్దస్త్ స్టేజ్ మీదనే రష్మీపై నీ అభిప్రాయం ఏంటి? మీ ఇద్దరి మధ్య ఏముంది? అంటూ ప్రశ్నలు అడిగేసింది. సుధీర్, రష్మీ ఫ్యాన్స్ ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నారని చెప్పింది. రష్మీ అయితే సిగ్గుతో తలదించుకుంది.
సుధీర్ మాత్రం.. రష్మీ అంటే తనకు ఎంతో అభిమానమని.. తన విజయం వెనుక లేదని.. తన పక్కనే ఉందని.. రష్మీయే తన విజయం అని.. ఎనిమిదేళ్ల నుంచి తన పక్కనే ఉంటూ తన విజయంలో సహకరించిందంటూ ఏదేదో చెప్పాడు సుధీర్.
అసలు.. సుధీర్ అంటే ఎవ్వరూ గుర్తు పట్టరు కానీ.. సుధీర్, రష్మీ అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు జనాలు. సుధీర్ ఫ్యాన్స్ కూడా సుధీర్, రష్మీ జంటగానే ఉండాలని కోరుకుంటున్నారు.. అంటూ సుధీర్ చెప్పుకొచ్చాడు.
ఇదంతా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో చూపించారు. మరి.. నిజంగా ఏం జరిగింది? మొత్తానికి వాళ్లిద్దరూ లవర్స్ అయ్యారా? లేక ఫ్రెండ్స్ గానే మిగిలారా? అనే విషయం తెలియాలంటే మాత్రం ఎక్స్ ట్రా జబర్దస్త్ వచ్చే ఎపిసోడ్ చూడాల్సిందే.