నటిగా కొన్ని దశాబ్ధాల పాటు అలరించిన రోజా ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చి ఎంఎల్ఏ అయ్యారు.
MLA అంటే ఎలా ఉంటారు.. తెల్లబట్టలు వేసుకుని చాలా డిగ్నిటీ మెయింటేన్ చేస్తూ.. కాస్త సోషల్ డిస్టేన్సింగ్‌లో ఎంతో హూందాగా కనిపిస్తుంటారు. కానీ అందులో ఏ ఒక్క లక్షణం కూడా లేకుండా ఉంటుంది రోజా. ఇదేదో నెగిటివ్ కోణంలో చెప్తున్న మాట కాదు. ఆమె ఎంత సింపుల్ గా ఉంటుందని చెప్పడానికి చెప్తున్న మాట అంతే. అంతేకానీ అందులో పరమార్థాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. రెండుసార్లు ఎమ్మెల్యే.. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖలో కీలక పదవి.. అన్నింటికి మించి మాజీ హీరోయిన్ అనే అలంకారం అన్నీ రోజా సొంతం. ఇవన్నీ ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంది రోజా. అప్పుడప్పుడూ ఈమె చేసే డాన్సులకు విమర్శలు వస్తుంటాయి.
బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలా డాన్సులు చేయడం ఏంటి.. జబర్దస్త్ షోలో ఆ వెకిలి నవ్వడం ఏంటి అంటూ విమర్శించే వాళ్లు కూడా లేకపోలేదు. అయినా కూడా తన పని తాను చూసుకుంటుంది రోజా. ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా రాజకీయాలతో పాటు ఎంటర్‌టైన్మెంట్‌కు కూడా టైమ్ కేటాయిస్తుంది. దాంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది రోజా. వీలు దొరికిన ప్రతీసారి తన కుటుంబానికి చాలా సమయం ఇస్తుంటుంది. ఇంత బిజీ లైఫ్‌లో కూడా అప్పుడప్పుడూ కుటుంబంతో పాటు టూర్స్ వెళ్లొస్తుంటుంది.
అలా ఈ మధ్య కాలంలో తన బర్త్ డేను ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంది రోజా. ఆ సమయంలో భర్త సెల్వమణితో కలిసి డాన్సులు చేసింది ఈ మాజీ హీరోయిన్. వీటికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో రోజా, సెల్వమణి మొన్న విడుదలైన సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాలోని కాటుక కనులే పాటకు స్టెప్పులేసారు. అందులో రోజా అదిరిపోయే చిందులు వేస్తుంటే.. సెల్వమణి మాత్రం భార్యను చూస్తుండిపోయాడు అలాగే. ఈ ఇద్దరి జోడీ చూసి నెటిజన్లు కూడా సూపర్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.