Rohith Sharma: రోహిత్ శర్మ… ఫైనల్ తర్వాత కీలక నిర్ణయం?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి క్రికెట్ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది. అతని కెప్టెన్సీ స్కిల్స్ గురించి ఎలాంటి సందేహం లేకపోయినా, బ్యాటింగ్‌లో అతను నిర్దిష్ట స్థాయిలో రాణించడంలో వెనుకబడుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన సిరీస్‌లు, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇది బీసీసీఐ దృష్టికి వెళ్లడంతో రోహిత్ భవిష్యత్తు గురించి స్పష్టత రాబోతోందని సమాచారం.

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. స్టీవ్ స్మిత్, ముష్ఫికర్ రహీమ్ వన్డేలకు వీడ్కోలు పలికారు. జోస్ బట్లర్ కూడా ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఇది పూర్తిగా అతని వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ, బీసీసీఐ కూడా దీనిపై సమీక్షలు ప్రారంభించినట్లు సమాచారం.

మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ తర్వాత రోహిత్ తన భవిష్యత్తును ప్రకటించవచ్చని బీసీసీఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ రోహిత్ శర్మ వన్డే క్రికెట్ నుంచి వైదొలిగితే, అతడి స్థానాన్ని భర్తీ చేసే బాధ్యత బీసీసీఐపై పడనుంది. ఇప్పటికే కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఇండియన్ క్రికెట్ అభిమానులు మాత్రం రోహిత్ ఇంకా కొంత కాలం జట్టును నడిపించాలి అని భావిస్తున్నారు. కెప్టెన్‌గా అతని అనుభవం జట్టుకు ఎంతో మేలు చేస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఫైనల్ తర్వాత అతను ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

పవన్ లో పౌరుషం లేదు || YCP Syamala Shocking Comments On Pawan Kalyan || Chandrababu || Telugu Rajyam