క్రేజీ టాక్ : “సలార్” లో రాకీభాయ్ ఉంటాడా?ఎలాగంటే 

ప్రస్తుతం ఎలాంటి సందేహం లేకుండా కూడా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు ఈజీగా కొల్లగొట్టే సినిమాల లిస్ట్ లో ఆల్ మోస్ట్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్ని సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో అయితే మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ ఏక్షన్ మూవీ “సలార్” కూడా ఒకటి.

మరి ఈ భారీ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా చిత్ర యూనిట్ ఈ సినిమాని శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేసిన కేజీఎఫ్ సినిమాల నుంచి ఓ యూనివర్స్ లా తన సినిమాలు ఉంటాయని అందులో భాగంగానే సలార్ కూడా ఒక భాగం అని తెలిపారు.

అయితే ఇప్పుడు ఓ క్రేజీ టాక్ ఎందుకు నిజం కాకూడదు అన్నట్టుగా వైరల్ అవుతుంది. ఇప్పుడు సలార్ లో అయితే తప్పకుండా రాకీ భాయ్ తో లింక్ ఉంటుందని కొన్ని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే దీనికి బలమైన కారణం లేకపోలేదు. కేజీఎఫ్ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యిపోయాక కూడా యష్ తన గడ్డం లుక్ ని అయితే మార్చలేదు.

దీనితో ఇదంతా సలార్ లో తన రోల్ కోసమే అని కొందరు అంటున్నారు. కాగా ఈ సినిమాలో రాకీ పాత్ర సుమారు 7 నుంచి 10 నిమిషాల పాటు ఉంటుంది అని అందుకే యష్ అయితే అదే లుక్ లో ఇప్పటికీ ఉండిపోయాడని అంటున్నారు. మరి ఇంత తక్కవ నిడివి కి కూడా అప్పటి నుంచి ఎవరన్నా అదే లుక్ ఉంచుకుంటారా అనేది కూడా ప్రశ్నగా మారింది. కానీ ఇప్పుడు ఏ సెన్సేషనల్ రూమర్ అయితే సినీ వర్గాల్లో రచ్చ లేపుతుంది.