జబర్దస్త్ షోలో రాకింగ్ రాకేష్ గురించి అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలతో కలిసి స్కిట్లు చేస్తూ బాగానే పేరు సంపాదించుకున్నాడు. యోద, దీవెన వంటి పిల్లలతో స్కిట్ చేస్తూ పాపులర్ అయ్యాడు. అదే సమయంలో ఆ పిల్లలను కూడా ఫేమస్ చేసేశాడు. మొత్తానికి అలా అందరికీ ఓ గుర్తింపు కూడా వచ్చింది. ఆపిల్లలకు స్కిట్లు ప్రాక్టీస్ చేయించడం ఎంత కష్టమో.. వాళ్లు తనను ఎంత టార్చర్ చేస్తాడో చెబుతూ ఎన్నో స్కిట్లు కూడా చేశాడు. అలాంటి రాకేష్ తాజాగా అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేశాడు.
తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోను విడుదల చేశారు. వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో రాకేష్ అదిరిపోయే కాన్సెప్ట్‌ను పిక్ చేసుకున్నాడు. మన దేశంలో రైతు టాపిక్ అనేది ఎప్పుడూ టచ్ చేసే అంశమే. అలాంటి ఓ అంశంతోనే రాకేష్ రానున్నాడు. పంటలను బిడ్డలుగా భావించిన రైతు అకాల వర్షాలు దెబ్బ కొడితే ఎలా కుంగిపోతాడో తన స్కిట్ ద్వారా చూపించాడు. రాకింగ్ రాకేష్ స్కిట్‌లో భాగంగా పిల్లలకు మిరపకాయ్, టమాటా, ఉల్లి అంటూ పేర్లు పెట్టి అలాంటి క్యాస్టూమ్స్ వేశాడు.
పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో అకాల వర్షం మొత్తం నాశనం చేస్తుంది.. పుస్తలమ్మి పంట వేశాను.. వచ్చిన డబ్బులతో పిల్లల పెళ్లిళ్లు చేద్దామని అనుకున్నాను. చివరకు ఇలా జరిగిపోయిందని ఆవేదన చెందుతుంటాడు. సిగరెట్లు తాగితే చనిపోతామని తెలుసు కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు.. అన్నం లేకపోతే చచ్చిపోతామని తెలుసు కానీ అవి పండించే రైతు మాత్రం పేదవాడిగానే ఉంటున్నాడని రాకేష్ చెప్పిన డైలాగ్ పండించిన ఎమోషన్ అందర్నీ కంటతడి పెట్టించేలా ఉన్నాయి.