అనసూయతో అలాంటి పనులా?.. రాకెట్ రాఘవ మామూలోడు కాదు!!

Rocket Raghava Comments On Anasuya In Jabardasth

జబర్దస్త్ పుట్టినప్పటి నుంచి రాకెట్ రాఘవ అందులోనే ఉన్నాడు. మరీ వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలానే కామెడీ చేస్తుంటాడు. మధ్య మధ్యలో కాస్త కామెడీ శ్రుతి మించినట్టు అనిపించినా కూడా ఎప్పుడూ కూడా లైన్ దాటలేదు. ఫ్రస్ట్రేటెడ్ క్యారెక్టర్‌లో రాఘవ చేసే కామెడీ బాగానే ఉంటుంది. గత వారంలోనూ అంతే. తాగినప్పుడు ఎలా వీరంగం ఆడుతాడో చూపించాడు. తాగినప్పుడు ఒకవేళ రోజా పేరు ఎత్తితే అనసూయ పేరు ఎత్తితే ఎలా శివాలెత్తుతారో కామెడీగా చూపించాడు.

Rocket Raghava Comments On Anasuya In Jabardasth
Rocket Raghava Comments On Anasuya In Jabardasth

ఇక ఈ వారంలో డ్రీమ్స్ అంటూ మరో కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. కలలో ఎక్కడికైనా వెళ్లొచ్చు ఎలాగైనా ఉండొచ్చు.. ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అంతా ఫ్రీనే అంటూ కలల గొప్పదనం గురించి చెప్పుకొచ్చాడు. అందుకే కలలు కంటాను అని రాఘవ తన స్కిట్ మొదలెట్టేశాడు. అయితే ఆ కలలో అనసూయ వచ్చేసిందట. మొత్తానికి రాఘవ కూడా అనసూయను వదల్లేదని ఇక్కడే నిరూపించుకున్నాడు. ఓ వైపు ఆది కూడా అనసూయనే తన స్కిట్లలో వాడుతుంటాడు.

ఇప్పుడు రాఘవ కూడా తన స్కిట్లలో అనసూయనే వాడేసుకుంటున్నాడు. అయితే కలలోకి అనసూయ రావడంతో రాఘవ తెగ ఎగ్జైట్ అయిపోయాడు. దగ్గరికి రా సెల్ఫీ తీసుకుందాం.. దగ్గరకు రా అంటూ కలవరించేశాడు. మొత్తానికి రాఘవ మాత్రం ఇంకా తనలోని చిలిపిదనం పోలేదని ఇలా కల, స్కిట్ అంటూ కలరింగ్ ఇచ్చేశాడు. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో రాకెట్ రాఘవ స్కిట్ బాగానే క్లిక్ అయింది. ఇక ఎపిసోడ్‌‌లో స్కిట్ ఎలా ఉంటుందో చూడాలి.