Malaika Arora: బాలీవుడ్ నటికి రోడ్డు ప్రమాదం.. గాయాలతో ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరోయిన్‌

Malaika Arora: బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పుణేలో ఏర్పాటు చేసిన ఓ ఫ్యాషన్‌ ఈవెంట్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకు న్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను నేవీ ముంబైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స అందుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మలైకా నుదిటిపై, కంటి దగ్గర చిన్న గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అంతే కాకుండా ఆమెకు సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు, రాత్రికి అబ్జర్వేషన్‌లో ఉంచుతామని, రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.

అయితే ఈ సమయంలో మలైకా తన డ్రైవర్, బాడిగార్డ్ తో కలిసి ప్రయాణిస్తున్నారని సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న మహారాష్ట్ర నవనిర్మాన్ సేన కు చెందిన ఓ నాయకుడు ఆమెను తన కారులో ముంబైకి తీసుకెళ్లారని సిబ్బంది పేర్కొంటున్నారు.

ఇక మ‌లైకా అరోరా కేవ‌లం హిందీలోనే కాకుండా తెలుగులోనూ కొన్ని స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించారు. తెలుగులో మ‌హేష్ బాబు హీరోగా చేసిన అతిథి సినిమాతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా చేసిన గ‌బ్బ‌ర్ సింగ్‌లోనూ ఐటెమ్ సాంగ్‌తో ఆమె మెప్పించారు. హిందీలో ప‌లు డాన్స్ ప్రోగ్రామ్స్‌కు ఆమె హోస్ట్‌గా, జ‌డ్జ్‌గా వ్యహ‌రిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఫిట్‌నెస్ విష‌యంలో ఎంతో కేర్ తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు, బుల్లితెర‌తో పాటు సోష‌ల్ మీడియాలోనూ మ‌లైకా చాలా యాక్టివ్‌గా ఉంటారు.