ఇండస్ట్రీ టాక్ : ఏపీలో “భోళా శంకర్” రిస్కీ బిజినెస్.?

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా కోసం తెలుగు ఆడియెన్స్ కి చెప్పక్కర్లేదు. తాను ఒకప్పుడు రీమేక్ చిత్రాలతో కూడా ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇపుడు కాలం అలా లేదు. రీమేక్ సినిమాలకి అసలే మార్కెట్ లేదు. కాగా ఇపుడు మెగాస్టార్ రీమేక్ చేస్తే జస్ట్ మినిమమ్ ఓపెనింగ్స్ వస్తున్నాయి తప్ప ఎక్కడా కూడా అదిరే లెవెల్ ఓపెనింగ్స్ గాని లాభాలు కానీ రావడం లేదు.

దానికి బెస్ట్ ఉదాహరణగా గాడ్ ఫాదర్ రిజల్ట్ చెప్పుకోవాలి. ఆ సినిమా సూపర్ పాజిటివ్ టాక్ కూడా వచ్చింది కానీ సీన్ కట్ చేస్తే ఆ సినిమా వసూళ్లు ఎంత వచ్చాయో ఎవరికీ కూడా తెలీదు. ఇక దీని తర్వాత వచ్చిన “వాల్తేరు వీరయ్య” డైరెక్ట్ ప్రాజెక్ట్ కావడం అదే పాజిటివ్ టాక్ కూడా రావడంతో మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర గర్జించాడు.

దీనితో తన కెరీర్ లో మరిన్ని లాభాలు అందించి పెట్టాడు. అయితే దీని తర్వాత దర్శకుడు మెహర్ రమేష్ తో అయితే “భోళా శంకర్” అనే రీమేక్ ని ఇప్పుడు చేస్తుండగా దీనికి వాల్తేరు వీరయ్య ఎఫెక్ట్ తో మంచి బజ్ ఉంది. కాగా నెక్స్ట్ అయితే ఈ సినిమాకి కూడా భారీ బిజినెస్ ఇపుడు స్టార్ట్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

ముఖ్యంగా ఏపీ మొత్తంలో అయితే భోళా శంకర్ 45 నుంచి 50 కోట్ల మధ్యలో బిజినెస్ బ్రేకప్ చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. కాగా ఓ రీమేక్ విషయంలో మాత్రం ఇంత మొత్తం చాలా రిస్కీ అని చెప్పాలి. ఇప్పటికే ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో “ఏజెంట్” డిజాస్టర్ ఉంది.

దీనితో భోళా శంకర్ టాక్ వచ్చినా వసూళ్లు ఆడియెన్స్ ఇస్తారా లేదా అనేది సందేహమే.. దీనితో అయితే భోళా శంకర్ బిజినెస్ మాత్రం కాస్త రిస్కీ గానే ఉండేలా ఉందని చెప్పాలి. తక్కువ నంబర్స్ కి అమ్మితే డిస్ట్రిబ్యూటర్స్ ఏమన్నా లాభాలు చూసే ఛాన్స్ ఉంది.