కన్నడ హీరో రిషబ్ శెట్టి ఆయన స్వీయ దర్శకత్వంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార. ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా భారీ లాభాలను తీసుకురావడంతో హీరో రిషబ్ శెట్టి ఎంతో సంతోషంలో ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హీరో రిషబ్ శెట్టి కాంతార సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
రిషబ్ శెట్టి ఈ సినిమాకు కథ రచయితగా కూడా పనిచేశారు. ఈయన తన సొంత గ్రామంలో తమ కులస్తులు పాటించే ఆచార వ్యవహారాలను ఈ సినిమాలో చూపించారు.తన సొంత గ్రామంలో నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని ముందుగా కన్నడ హీరో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కోసం ఈ కథ సిద్ధం చేశారట.అయితే పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది ఆకస్మిక గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా పునీత్ రాజ్ కుమార్ మరణించడంతో ఈ పాత్రలో హీరో రిషబ్ శెట్టి నటించడం జరిగిందనీ ఈయన వెల్లడించారు.అయితే ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఈ సినిమాలో కనుక పునీత్ రాజ్ కుమార్ నటించి ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండేది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను రిషబ్ శెట్టి ఎక్కువ భాగం తన సొంత గ్రామంలోని చిత్రీకరించారని తెలుస్తోంది.ఏది ఏమైనా ఒక అద్భుతమైన సినిమాను రిషబ్ శెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.