సైగలతో రష్మికకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రిషబ్ శెట్టి.. ఇద్దరి మధ్య ముదురుతున్న వివాదం?

కాంతార సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందారు హీరో రిషబ్ శెట్టి. ఈయన హీరోగా కన్నా దర్శకుడిగా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.మొదటిసారి ఈయన కిరిక్ పార్టీ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించి మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి రష్మిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఇలా ఈ సినిమా మంచి విజయం కావడంతో రష్మిక కూడా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇకపోతే తాజాగా రిషబ్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే వచ్చిన కాంతార సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా గురించి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించినప్పటికీ రష్మిక మాత్రం స్పందించలేదు. ఇదే విషయమే తనని ప్రశ్నించగా తనకు సినిమా చూసే టైం లేదంటూ సమాధానం చెప్పారు. దీంతో ఒక్కసారిగా కన్నడ ప్రేక్షకులు రష్మికపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీరు మీ తదుపరి సినిమా సమంత రష్మిక సాయి పల్లవి ఈ ముగ్గురిలో ఎవరితో చేస్తారు అంటూ ప్రశ్నించగా ఈయన సమాధానం చెబుతూ నేను తన జీవితంలో కొందరికి హీరోయిన్లతో పని చేయకూడదని అనుకుంటున్నాను. ఇక సమంత సాయి పల్లవి డెడికేషన్ తనకు బాగా నచ్చుతుందని తెలిపారు. కొత్త హీరోయిన్లకు తాను అవకాశం కల్పించాలని అనుకుంటున్నాను అంటూ రష్మిక సిగ్నేచర్ హాండ్స్ చూపిస్తూ రష్మికకు తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.