బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారంటూ గుట్టు బయటపెట్టిన రియా చక్రవర్తి

Rhea chakraborty names rakul preeth singh and sara ali khan in bollywood drug case

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు కాస్త డ్రగ్స్ కేసుగా మారిపోయింది. ఆయన మృతి కేసు ఇలా డ్రగ్స్ కేసుగా మారి.. మరో మలుపు తిరుగుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ కేసులో తన ప్రేయసే ప్రధాన నిందితురాలుగా మారడం.. రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి పలు సంచలన నిజాలను ఆమె నుంచి రాబడుతున్నారు.

Rhea chakraborty names rakul preeth singh and sara ali khan in bollywood drug case
Rhea chakraborty names rakul preeth singh and sara ali khan in bollywood drug case

బాలీవుడ్ లో డ్రగ్ రాకెట్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదే. ఇఫ్పుడే కొత్తేమీ కాదు. కాకపోతే.. డ్రగ్స్ ను అడ్డం పెట్టుకొని మనుషుల జీవితాలతో కొందరు ఆడుకుంటున్నారు. సుశాంత్ జీవితం కూడా అలాగే ముగిసిపోయింది. తన ప్రేయసి రియా చక్రవర్తి… సుశాంత్ కు డ్రగ్స్ కు అందించి మత్తులోకి దించేదని.. ఇప్పటికే వెలుగుచూసిన విషయమే.

ఇక.. తనను విచారిస్తున్న అధికారులు రియా చెబుతున్న పేర్లు విని షాక్ కు గురవుతున్నారట. పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేరును రియా బయటపెట్టినట్టు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ కు కూడా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నట్టు రియా విచారణలో తెలిపినట్టు సమాచారం.

వీళ్లిద్దరితో పాటుగా ప్రముఖ డిజైనర్ సిమోన్ ఖంబట్ట పేరును కూడా రియా బయటపెట్టినట్టు తెలుస్తోంది. రియా మొత్తం బాలీవుడ్ సెలబ్రిటీలు 25 మంది పేర్లను బయటపెట్టిందట. ఆ 25 మంది ప్రముఖులపై ఎన్సీబీ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.

ఇక..రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు సెప్టెంబర్ 8న అరెస్ట్ చేశారు. ఆమె సోదరుడు షోవిక్ ను అంతకు ముందే అరెస్ట్ చేశారు. వీళ్లిద్దరు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే.. రియా బెయిల్ పిటిషన్ ను స్పెషల్ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.