లోకేష్‌పై వర్మ కొత్త సినిమా.?

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తాడు. పబ్లిసిటీలో భాగంగానే ఆయన సినిమాల అనౌన్స్‌మెంట్లూ వుంటాయ్. లేటెస్ట్‌గా ‘వ్యూహం’ అనే సినిమాని అనౌన్స్ చేశారాయన. ఆ సినిమాకి సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసి జనాల్లో అటెన్షన్ పెంచేశాడు.

జగన్ ఆయన భార్య భారతికి సంబంధించి గత ఎన్నికల నేపథ్యంలో జరిగిన యవ్వారాలను ఈ సినిమాలో చూపించబోతున్నాడని తెలిసిందే. తాజాగా మరో సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్ చేశాడీ సంచలనాల వర్మ. ఈ సారి మన డైరెక్టర్‌గారి గాలి లోకేష్ మీద పడింది. లోకేష్ మీద ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. అందుకోసం తెర వెనక గట్టిగానే ప్రయత్నాలు మొదలెట్టేశాడట కూడా.

అయితే, తన స్టైల్‌లో లోకేష్‌ని పోలి వుండే నటుడి కోసం వర్మ వెతుకులాగ మొదలెట్టాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, వివరాలు ప్రకటించనున్నాడట రామ్ గోపాల్ వర్మ. అదీ సంగతి.