RGV: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఎంతోమంది సినీ సెలెబ్రేటీలు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియా వేదిక పోస్టులు చేయడమే కాకుండా మరి కొంతమంది స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరి అల్లు అర్జున్ పరామర్శిస్తున్నారు ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్నారు.
ఇప్పటికే ఎంతోమంది డైరెక్టర్లు నిర్మాతలు సెలబ్రిటీలు అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని ఆయనని పరామర్శించారు. ఇకపోతే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచినటువంటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం అల్లు అర్జున్ అరెస్టు పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుత వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఈయన పోలీసులను నాలుగు ప్రశ్నలు వేస్తూ ప్రశ్నించారు.
*ఏదైనా పుష్కరాలు బ్రహ్మోత్సవాల సమయంలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్లను కూడా అరెస్టు చేస్తారా అంటూ ఈయన ప్రశ్న వేశారు.
*ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కనుక ఎవరైనా చనిపోతే రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారా?
*సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తొక్కిసలాట జరిగి ఎవరైనా అభిమానులు చనిపోతే హీరో హీరోయిన్లను అరెస్టు చేస్తారా?
*భద్రత ఏర్పాట్లను పోలీసులు, నిర్వాహకులు తప్ప హీరోలు, నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు అంటూ ఈయన నాలుగు ప్రశ్నలు వేస్తూ ట్వీట్ చేశారు.
ఇలా ఈ ప్రశ్నలు వేయడం చూస్తుంటే అక్కడ తొక్కిసలాట జరగడంతో పూర్తిగా పోలీసుల వైఫల్యమే కారణమని, అందుకు అల్లు అర్జున్ ని బాధ్యున్ని చేసి అరెస్టు చేయడం సబబు కాదు అన్న ఉద్దేశంతోనే రామ్ గోపాల్ వర్మ ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
. @alluarjun కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు .
1.
పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?
2.
ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?
3.
ప్రీ రిలీజ్…
— Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2024