RGV : ఆర్ఆర్ఆర్ గురించి ఆర్జీవి చేసిన కామెంట్స్ ఏంటో తెలుసా…!

RGV : రాజమౌళి మాస్టర్ మైండ్ తో తీసిన చిత్రం త్రిబుల్ ఆర్ ఇక ఈ చిత్రం విడుదలయి సంచలనాలు సృష్టిస్తోంది. ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ ముచ్చటే. ఇక ఈ సినిమా ప్రపంచం వ్యాప్తంగా విడుదలయి అన్నిచోట్లా రచ్చ చేస్తోంది. ఇక చరణ్,ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అటు రేటింగ్స్ లో కూడా దూసుకుపోతోంది.

బాహుబలి సినిమా తో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి , ఆర్ఆర్ఆర్ తో మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు రాజమౌళి ప్రతిభ ఫై , ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటన ఫై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక చిత్ర సీమలో అయితే ప్రతి ఒక్కరు సినిమా కు జై జై లు కొడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు , హీరోలు, దర్శకులు , నిర్మాతలు సినిమా ఫై ప్రశంసలు జల్లు కురిపించగా. తాజాగా వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

బాహుబలితో ఆర్‌ఆర్‌ఆర్‌ని పోలుస్తూ ఇదొక చారిత్రాత్మక చిత్రం అని కొనియాడాడు. ‘బాహుబలి-2 అనేది చరిత్ర.. ఆర్‌ఆర్‌ఆర్‌ అనేది చారిత్రాత్మకం’అని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. అలాగే దర్శకుడు రాజమౌళిని ఉద్దేశించి… బాక్సాఫీస్‌కు మోక్షం కలిగించిన గొప్ప వ్యక్తి అనే అర్థంలో ఆర్జీవీ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది