ప్రభాస్ సినిమాలో RGV?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి. అన్ని సినిమాలకు కాల్ సీట్స్ కేటాయించడంతో టైం చూసుకుని ఒక్కో మూవీ షెడ్యూల్ లో జాయిన్ అవుతున్నారు. ఇదిలా ఉంటే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా డీలక్స్ అనే హర్రర్ కామెడీ సినిమా చేస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ లో ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రభాస్ లేని సన్నివేశాలను ప్రస్తుతం మారుతి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. వారికి సంబందించిన ఎపిసోడ్స్ షూటింగ్ కూడా జరుగుతుందని టాక్.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ మూవీలో కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ ఇంట్రెస్టింగ్ రోల్ లో నటిస్తూ ఉన్నారు. ఇక ఆర్జీవీ నటించే సన్నివేశాలకు సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ చేశారని టాక్. అయితే ఆ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో రాలేదనే మాట వినిపిస్తుంది.

ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ వరుసగా వివాదాలలో తలదూర్చుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయారు. రాజకీయ సంబంధమైన విషయాలను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే కాస్త వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ సంచలనంగా మారుతున్నారు. మరి అలాంటి దర్శకుడుని మారుతి ఎలాంటి పాత్ర కోసం ఎంపిక చేశారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది.

ఈ మధ్యకాలంలో ఆర్జీవి కూడా తన సినిమాలలో నటుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మారుతి సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ లో సందడి చేయబోతున్నారనే మాట వినిపిస్తుంది. ఇక ఈ సన్నివేశాలు ఉంటాయా లేదా అనేది ఎడిటింగ్ రూమ్ లో డిసైడ్ అవుతుందని టాక్.