రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. పర్సనల్ విషయాలు, ప్రొఫెషన్ విషయాలే కాకుండా సామాజిక సమస్యలపైనా రేణూ దేశాయ్ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. సమాజంలోని అసమానతలు, ఆడవారిపై జరిగే దౌర్జన్యాలు, అత్యాచారాలపై రేణూ దేశాయ్ శివాలెత్తుతుంది. అమ్మాయిలపై జరిగే ఘోరాలపై నాయకులు, సమాజాన్ని ప్రశ్నించేలా పోస్ట్‌లు పెడుతుంది.
హత్రస్ ఘటన అయినా దిశ ఘటన అయినా ఇలా ప్రతీ సారి రేణూ దేశాయ్ తనదైన శైలిలో స్పందిస్తూ తన బాధ్యతను నెరవేరుస్తుంది. ఇక ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుతూ అమ్మాయిలదే తప్పు అలాంటి డ్రెస్సులు వేసుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వాగే వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటుంది. అలాంటి రేణూ దేశాయ్ తాజాగా ఓ పోస్ట్ చేసింది.
మనం దేవీ నవరాత్రులు ఎంత భక్తి శ్రద్దలతో నిర్విహిస్తామో అందరికీ తెలిసిందే. నిష్టగా ఆ తొమ్మిది అ రోజులు అమ్మవారిని పూజిస్తాము. అంటే ఆడవారిని ఆరాధిస్తాము. కానీ సంవత్సరంలో మిగిలిన 357 రోజులు మాత్రం అత్యాచారాలు చేస్తుంటారు. ఈ తొమ్మిది రోజులు దేవతలను ఎలా పూజిస్తారో మిగతా రోజులు ఆడవారిని కూడా అలానే పూజించండి.. ఆడవారిని గౌరవించండి అని రేణూ దేశాయ్ కోరింది. మొత్తానికి ఒక్క ఫోటోతో ఎంతో మంచి సందేశాన్ని ఇచ్చింది.