“బాహుబలి” సినిమాపై రేణూ దేశాయ్ ఆసక్తికర పోస్ట్ వైరల్.!

ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటైన చిత్రం “బాహుబలి” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా రిలీజ్ లకి అలాగే సీక్వెల్ చిత్రాలకి కూడా ఒక మార్గాన్ని సెట్ చేసి ఓ పాత్ బ్రేకింగ్ మూవీగా అయితే నిలిచింది.

ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా కూడా మంచి పాపులారిటీ తెచ్చుకోగా లేటెస్ట్ గా అయితే సైలెంట్ గా ఓ చోట బాహుబలి లైవ్ గా ప్రదర్శింపబడింది. అంటే సినిమా పైన తెరపై ప్లే అవుతుండగా కింద ఆ చిత్రం తాలుకా మ్యూజిక్ కి అనేకమంది సంగీత విద్వాంసులు లైవ్ లో అక్కడికక్కడే ప్లే చేస్తారు.

ఇది వినడానికే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటే దానిని లైవ్ లో చూసి వినేవారికి ఎలా ఉంటుంది.? మరి లేటెస్ట్ గా అయితే టాలీవుడ్ ప్రముఖ నటి హీరో పవన్ కళ్యాణ్ భార్య చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. యూఎస్ స్టావెంజర్ కాన్సెర్ట్ హాల్ లో అయితే బాహుబలి చిత్రాన్ని చూశామని లైవ్ లో ఇలా చూడడం చాలా అద్భుతంగా ఉందని రేణూ తెలిపారు.

దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఐతే ఇదే స్టావెంజర్ కాన్సెర్ట్ కి గాను చిత్ర దర్శకుడు రాజమౌళి కూడా తన చిత్ర మెయిన్ టీం తో హాజరు అయ్యారు. అలాగే తాను కూడా పలు పోస్ట్ లు పెట్టడం ఆసక్తిగా మారాయి.