వామ్మో మళ్లీ మొదలెట్టేసిందిగా… రేణూ దేశాయ్ స్టన్నింగ్ లుక్

Renu Desai Acts In Web series

రేణూ దేశాయ్ సినిమాల్లో నటించి చాలా కాలం అవుతోంది. బుల్లితెరపై కనిపించి కూడా చాలా రోజులే అవుతోంది. వెండితెర, బుల్లితెరకు రేణూ దేశాయ్ సుపరిచితురాలే. అయితే వెబ్ సిరీస్ అనే రంగానికి ఓటీటీ ఫ్లాట్‌ఫాంలకు రేణూ దేశాయ్ కొత్త. కానీ తాజాగా రేణూ దేశాయ్ ఓ ప్రాజెక్ట్‌ను కన్ఫాం చేసినట్టు తె లుస్తోంది. అయితే తన ప్రాజెక్ట్ కూడా ఒకటి పెండింగ్‌లో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే.

Renu Desai Acts In Web series
Renu Desai Acts In Web series

రైతు కాన్సెప్ట్ ఆధారంగా ఓ చిత్రాన్ని చేయాలని రేణూ దేశాయ్ పరితపిస్తోంది. ప్రయత్నాలు చేస్తోందన్న సంగతి తెలిసిందే. గతేడాది కాలంపాటు ఆ ప్రాజెక్ట్ కోసం నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే గోరెటి వెంకన్న చేత పాటలు కూడా రాయించుకుంది. అయితే తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశాను. ఓ అద్భుతమైన వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పాను.. వచ్చే నెలలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది.. ఎంతో సంతోషంగా.. ఆత్రుతగా ఉంది. మరి కొన్ని రోజుల్లో మిగతా వివరాలను ప్రకటిస్తాను. మీరంతా మీ ఆశీర్వాదాన్ని ప్రేమను అందించాలని కోరుతున్నాను. ఓ నిజం కోసం పరిశోధించే మహిళకు అండగా ఉండాలి. డీఎస్ రావు, రజినీకాంత్ ఎస్ ఈ వెబ్ సిరీస్‌ను సాయికృష్ణ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఎం ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు. దాశరది సివేంద్ర కెమెరా‌మెన్‌గా పని చేస్తున్నారు. ఇక నటించడం మళ్లీ మొదలెట్టేసిందంటే.. త్వరలోనే టాలీవుడ్‌లో వెండితెరపై కనిపిస్తుందేమో చూడాలి.