ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది. ప్లాస్టిక్ రహిత సమాజం చూడాలని ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేశాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాయి కూడా. అయితే ప్రజలు మాత్రం ఇంకా ప్లాస్టిక్‌ను వాడుతూనే ఉన్నారు. ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల వాతావరణానికి ఎంత చేటో చెబుతూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు.
అలా ప్లాస్టిక్‌లు వాడి నదులు, సముద్రాల్లో పారేయడంతో జీవ రాశుల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. నీళ్లలో పడేయడంతో అందులో నివసించే వాటికి విష పదార్థాలుగా మారుతున్నాయి. తాజాగా ఓ మొసలి చనిపోగా.. దాని కడుపులో ఎన్నో ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. ఈ విషయంపై రేణూ దేశాయ్ ఆవేదన చెందింది. మనుషుల బతికే విధానంపై రేణూ దేశాయ్ తీవ్రంగా విచారం వ్యక్తం చేసింది.
ఓ మొసలి కడుపు నుంచి 22 ప్లాస్టిక్ వ్యర్థాలు లభ్యమయ్యాని ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇలా మనం ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా వాడటంతో జీవరాశులకు ప్రాణ సంకటంగా మారుతోంది. ఇదే విషయాన్ని రేణూ దేశాయ్ స్పందించింది. మనుషులు ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటున్నారు? ఎందుకింత స్టుపిడ్‌లా బతుకుతున్నారని రేణూ దేశాయ్ ఆవేదన చెందింది. ఇంతకు ముందు ప్రకృతిని నాశనం చేస్తున్నారని రేణూ దేశాయ్ ఫైర్ అయింది.