అందరూ దాని గురించే అడుగుతున్నారట.. క్లారిటీ ఇచ్చిన రేణూ దేశాయ్

రేణూ దేశాయ్ ప్రస్తుతం వార్తల్లో తెగ హల్చల్ చేస్తోంది. గత వారం రోజుల నుంచి తన కొత్తప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులతో మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. లేడీ ఓరియెంటెడ్ కథతో రాబోతోన్న ప్యాన్ ఇండియన్ వెబ్ సిరీస్ దసరా నాడు ప్రారంభమైంది. ఆద్య అంటూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఈ వెబ్ సిరీస్‌లో నందినీ రాయ్, కబాలి ఫేమ్ ధన్సిక కూడా నటిస్తున్నారు.

Renu Desai About Film Based On Farmers

అయితే రేణూ దేశాయ్ దీనికంటే ముందుగా ఓ ప్రాజెక్ట్‌ను భుజాన వేసుకుంది. దాదాపుగా గత రెండేళ్లుగా రైతు ప్రాజెక్ట్‌పై ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దాని కోసం హైద్రాబాద్ చుట్టుపక్కలా కొన్ని లొకేషన్లు కూడా చూసింది. వికారాబాద్ అడువల్లోనూ గాలించింది. గోరెటి వెంకన్నతో పాటలు కూడా రాయించుకుంది. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. అయితే తాజాగా అందరూ ఈ సినిమా గురించే అడుగుతున్నారట.

ఈ మేరకు రేణూ దేశాయ్ స్పందిస్తూ.. రైతులపై నేను తీయాలనుకుంటున్న సినిమాకు సంబంధించి చాలా మెసెజ్‌లు వస్తున్నాయి. అది కచ్చితంగా చేస్తాను కానీ ఇప్పుడు కాదు.. ఎందుకంటే ఈ మూవీ షూట్ చేయాలంటే వేసవి కాలం రావాలి. ఎండిపోయిన భూములు ఉండాలి… అంటే 2021 సమ్మర్ వరకు షూటింగ్ చేయలేము.. అంటూ అసలు సంగతి చెప్పేసింది.