డిస్కౌంట్ల బాటలో రష్మిక.!

నిన్న మొన్నటిదాకా ‘రేటు’ విషయంలో ‘తగ్గేదే లే’ అని చెబుతూ వచ్చిన రష్మిక ఇప్పుడు పూర్తిగా మారిపోయిందట. ‘సర్లెండి, తగ్గించుకుందాం..’ అంటోందిట. అంతా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ ఎపెక్ట్ అని అంటున్నారు.

కానీ, రష్మిక ఒప్పుకోవడంలేదు. కింద పడ్డా పై చేయి తనదే.. అని చెప్పే రకం కదా.. రష్మిక అంత తేలిగ్గా ఒప్పుకోదు. బాలీవుడ్‌లో ‘మిషన్ మజ్ను’.. అంతకన్నా ముందొచ్చిన ‘గుడ్ బై’ సినిమాలు దెబ్బ కొట్టాయ్.

‘వారసుడు’ సినిమాలో రష్మికకి అంత సీన్ లేదని తేల్చేశారు. రష్మిక కూడా ఆ విషయాన్ని ఒప్పేసుకుంది. ఎలా చూసినా, రష్మిక మేనియా తగ్గిపోయిందిప్పుడు. దాంతో, డిస్కౌంట్ల దిశగా రష్మిక అడుగులేస్తోందట రెమ్యునరేషన్ పరంగా.

గతంలో ఓ యంగ్ హీరో సినిమాకి బెట్టు చేసిన రష్మిక (తెలుగులోనే), ఇప్పుడు ఆ నిర్మాతతో టచ్‌లోకి వెళ్ళిందట. అయితే, గతంలో ఇవ్వజూపిన రెమ్యనరేషన్ కంటే తక్కువే ఇస్తానంటున్నాడట ఆ నిర్మాత. రష్మిక కూడా చూచాయిగా ఓకే చేసిందట ఆ ప్రాజెక్టుని. తప్పదు మరి.!