రెజీనా నిజంగా ఆ పెద్దింటి కోడలు అవ్వాల్సిందా.. మరీ ఎందుకు ఇంకా ఇలానే?

సాధారణంగా ఒక హీరో హీరోయిన్ కలిసి ఒక సినిమాలో నటించి ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటే ఇండస్ట్రీలో ఆ జంటను హిట్ పెయిర్ అని పిలుస్తారు.అయితే ఒక సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మరో సినిమాలో కూడా వారిద్దరి కలిసి నటిస్తే వారి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు సృష్టిస్తారు. ఇలాంటి వార్తలను ఎదుర్కొన్న వారిలో నటి రెజీనా ఒకరు. ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి పిల్లా నువ్వులేని జీవితం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత ఈ కాంబినేషన్ లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమా విడుదలైంది. ఇలా వెంట వెంటనే రెండు సినిమాలు విడుదల కావడంతో ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని,రెజీనా పెద్దింటి కోడలు కాబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వీరి గురించి ఇలా వస్తున్న వార్తలపై ఈ సెలబ్రిటీలు ఎప్పుడూ స్పందించలేదు.

ఇక దాదాపు వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చినప్పటికీ రెజీనా మెల్లిమెల్లిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈమెకు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అవకాశాలు వచ్చిన ఆ సినిమాలు ప్రేక్షకులను సందడి చేయలేకపోవడంతో ఈమె పూర్తిగా తెలుగు తెరకు దూరమయ్యారు. ఇక ఈమెకు తెలుగులో అవకాశాలు వచ్చినా హీరోయిన్ గా కాకుండా ఏకంగా నెగిటివ్ పాత్రలలో నటించారు. గతంలో ఈమె గురించి పెద్ద ఎత్తున పెళ్లి వార్తలు వినిపించినప్పటికీ రెజీనా మాత్రం ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు. ఇలా పెద్దింటి కోడలు కావాల్సిన ఈమె పెళ్లి లేకుండా ఒంటరిగా గడపడంతో పలువురు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.