జూనియర్ ఎన్టీఆర్ నంబర్ వన్ హీరో కాకపోవడానికి ఈ తప్పులే కారణమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరో కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు అనే సంగతి తెలిసిందే. అయితే తారక్ నంబర్ వన్ హీరో కావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈతరం హీరోలలో ఎలాంటి పాత్ర ఇచ్చిఆ ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పేరుంది. అయితే ఎన్టీఆర్ మాత్రం నంబర్ 1 హీరో కాలేకపోయారు.

వరుసగా ఆరు విజయాలు సాధించినా ఆ సినిమాలు ఎన్టీఆర్ రేంజ్ కు తగిన హిట్లు అయితే కావని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా ఈ సినిమాలో ఎన్టీఆర్ మాత్రమే సోలో హీరో కాదనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ తొలినాళ్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆది, సింహాద్రి సినిమాలతో సంచలన విజయాలను అందుకున్నారు. అయితే సింహాద్రి తర్వాత వరుస ఫ్లాపులు ఎన్టీఆర్ కెరీర్ కు మైనస్ అయ్యాయి.

ఎన్టీఆర్ స్టామినాకు తగిన హిట్ ఈ మధ్య కాలంలో దక్కడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. దర్శకుల, కథల ఎంపికలో ఎన్టీఆర్ చేస్తున్న పొరపాట్లు కూడా తారక్ కెరీర్ కు ఒక విధంగా మైనస్ అయ్యాయని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ ను సొంతం చేసుకోవడం తారక్ కెరీర్ కు మైనస్ అయింది. వరుసగా మాస్ సినిమాలు చేయడం కూడా ఎన్టీఆర్ కు మైనస్ అయింది.

బ్లాక్ బస్టర్ కథలను రిజెక్ట్ చేయడం, సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా తారక్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. క్లాస్ కథలలో కూడా నటించి వాళ్ల మెప్పును ఎన్టీఆర్ పొంది ఉంటే ఎన్టీఆర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగేది. కెరీర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ వేసిన తప్పటడుగులు తారక్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయనే చెప్పాలి.