టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థ ఆయన మైత్రి మూవీ మేకర్స్ పై ఐటి అధికారులు ఆకస్మికంగా దాడులు చేసిన సంగతి విధితమే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల ఆఫీసులతో పాటు ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే దర్శకుడు సుకుమార్ ఆఫీసులో కూడా ఐటి ఆఫీసర్స్ సోదాలు చేయడం సంచలనంగా మారింది.
అయితే ఈ మధ్యకాలంలో చాలా తక్కువ సమయంలో రెండు సార్లు ఐటి అధికారులు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులపై దాడులు చేయడం విశేషం. ఇలా ఉన్నపలంగా ఇన్కమ్ టాక్స్ రైడ్స్ జరగడానికి కారణం ఏంటి అనేది ఆరా తీస్తే ఇన్సైడ్ వర్గాల సమాచారం మేరకు ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఏపీకి చెందిన అధికార పార్టీ నాయకుడితో పాటు మైనింగ్ వ్యాపారవేత్త భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లుగా వారికి సమాచారం అందిందంట.
ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం చేస్తున్న సినిమాలకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నట్లు టాక్. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఐటీ అధికారులు దాడులు చేశారని సమాచారం. ఈ దాడులలో అనధికారికంగా నిధుల వినియోగం జరిగినట్లుగా గుర్తించినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.
అలాగే చాలా పెద్ద మొత్తం పెట్టుబడులకు పన్ను ఎగవేత జరిగినట్లుగా ఐటి అధికారులు తనిఖీలలో బయటపడినట్లుగా ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పటివరకు ఇన్కమ్ టాక్స్ అధికారులు ఈ విషయాన్ని ఎక్కడా ధృవీకరించలేదు. కానీ దాడులలో లెక్కల్లో లేకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఎమ్మెల్యే పెట్టారనే టాక్ మాత్రం వినిపిస్తోంది.
ఈ రైడ్స్ కారణంగా ప్రస్తుతానికి పుష్ప ది రూల్ షూటింగ్ వాయిదా పడింది. మరి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ ఐటీ దాడుల నుంచి కోలుకిని ఎప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఈ మైత్రి మూవీ మేకర్ జరిగిన ఈ ఐటీ దాడులు టాలీవుడ్ లో ఇతర బడా నిర్మాతలను కూడా కాస్త టెన్షన్ పెట్టాయని చెప్పాలి.