Ravi Teja : రావణాసురగా రాబోతున్న మాస్ మహారాజ్…. సినిమా పై క్రేజీ అప్ డేట్…!

Ravi Teja : మాస్ మహా రాజా రవితేజ చేతిలో ప్రస్తుతానికి చాలా సినిమాలు ఉన్నాయి. ఖిలాడి సినిమాతో నిరాశ పరిచిన రవితేజ రామరావు ఆన్ డ్యూటీ సినిమా తో మళ్ళీ అభిమానుల అంచనాలను పెంచేసాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాట సినిమాకు మంచి హైప్ ను తెచ్చాయి. ఇక ఈ సినిమా తరువాత రవితేజ నటిస్తున్న మరో చిత్రం రావణాసుర. ఈ సినిమాలో ఒక న్యాయవాదిగా రవి కనిపించనున్నాడు. ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక మేఘా ఆకాశ్‌, అనూ ఇమ్మాన్యుయేల్ , దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక సుశాంత్ ఈ సినిమాలో నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమప దక్కించుకుంది. పెద్ద మొత్తంలో చెల్లించి సరిగమప ఈ హక్కులను దక్కించుకున్నట్లు ఇన్సైడ్ టాక్.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక రవితేజ మెగాస్టార్ చిరు తో కలిసి ఒక సినిమాలో చేయనున్నారు. అది కాకుండా బాలయ్య బాబు తో కూడా ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి కాకా టైగర్ నాగేశ్వర్రావు అనే పీరియడిక్ డ్రామాలో కూడా రవితేజ నటిస్తున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాకు నిర్మాత.