కుచర్లపాటి సుధీర్ వర్మ.. రచయితగా, డైరెక్టర్ గా మంచి పేరును తెచ్చుకున్నారు. అయితే 2013లో స్వామి రారా చిత్రంలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత దోచెయ్, కేశవ, రణరంగం వంటి చిత్రాలకు దర్శకుడిగా పని చేశారు.
తొలి సినిమాతోనే మంచి హిట్టు కొట్టడంతో అంతా అతడి నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ సినిమా వచ్చి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఆ రేంజ్ సినిమా ఒక్కటి కూడా రాలేదు. టేకింగ్ పరంగా బాగానే ఉన్నా, సరైన కథను ఎంచుకోక పోవడమే సుధీర్ సమస్య అని చాలా మంది అనుకున్నారు. కానీ ఇటీవలే రిలీైన రావణాసుర చూశాకా.. సుధీర్ టేకింగ్ సహా అన్ని విషయాల్లో పట్టు కోల్పోయాడని అనుకుంటున్నారు.
రావణాసుర చిత్రాన్ని థియేటర్లలో చూసిన వాళ్లంతా సుధీర్ వర్మపై విరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. పెద్దగా జనాల దృష్టిలో పడకుండానే ఆ సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కాగా… మరోసారి ఈ సినిమాపై చర్చ జరుగుతోంది. నెటిజెన్లు అందరూ సుధీర్ వర్మ మీద విరుచుకు పడ్డారు. స్వామి రారా తో ఇంటెలిజెంట్ డైరెక్టర్ అని హాలీవుడ్ ప్రమాణాలతో థ్రిల్లర్లు తీయగల సమర్థుడని కితాబు అందుకున్నాడు.
కానీ ఇప్పుడు మినిమం లాజిక్ లేకుండా మాస్క్ కాన్సెప్ట్ ను డీల్ చేసిన విధానం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంత సిల్లీగా సినిమా ఎలా తీశావ్ అంటూ సుధీర్ ను నిలదీస్తున్నారు. ఒకప్పుడు అతడిని అభిమానించిన వాళ్లే ఇప్పుడు తనపై విరుచుకు పడుతున్నారు. ఇలాంటి కథను సొంత బేనర్ లో ప్రొడ్యూస్ చేయడానికి రవితేజ ఎలా సిద్ధపడ్డాడని అడుగుతున్నారు.
కానీ ప్రధానంగా టార్గెట్ చేస్తుంది మాత్రం దర్శకుడు సుధీర్ నే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు తీసే దర్శకులు ఇలాంటి తప్పులు చేస్తే పట్టింకోరని చెప్పారు. కానీ స్వామి రారా లాంటి డిఫరెంట్ థ్రిల్లర్ తీసిన డైరెక్టర్ ఇంత ఇల్లాజికల్ గా సినిమా తీసే సరికి అంతా ఫుల్లుగా ఫైర్ అవుతున్నారు.