గాసిప్స్ : నితిన్ హీరోయిన్ పెళ్ళికి సిద్దమట.?

టాలీవుడ్ లో ఉన్న టైర్ 2 టాప్ హీరోస్ లో యూత్ స్టార్ నితిన్ కూడా ఒకడు. మరి నితిన్ హీరోగా చేసిన పలు చిత్రాల్లో చాలా మంది కొత్త హీరోయిన్స్ టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. మరి అలా అయ్యిన వారిలో అయితే నితిన్ తో పెద్దగా హిట్ ట్రాక్ లేకపోయినప్పటికీ బెస్ట్ కెమిస్ట్రీ ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నది మాత్రం కోలీవుడ్ యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ అనే చెప్పాలి.

కాగా మేఘా ఆకాష్ నితిన్ తో “ఛల్ మోహన రంగ”, “లై” చిత్రాలు చేయగా టాలీవుడ్ లో మరిన్ని చేసింది. ఇక రీసెంట్ గానే అయితే మెన్స్ మహారాజ “రావణాసుర” లో కనిపించింది. మరి ఇలా బిజీగా ఉన్న ఈ హీరోయిన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టుగా ఇపుడు సినీ వర్గాలు చెప్తున్నాయి. కాగా మేఘా అయితే తమిళనాడులో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు కొడుకుని అయితే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఇపుడు గాసిప్స్ మొదలయ్యాయి.

మరి అతడు ఎవరు ఏంటి అనే ఇతర వివరాలు మాత్రం ఇంకా బయటకి రాలేదు. ప్రస్తుతానికి అయితే ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. మరి మేఘా అయితే లేటెస్ట్ గా నటించిన హారర్ డ్రామా “భూ” నేరుగా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అవుతుంది. అలాగే మరికొన్ని తెలుగు సహా తమిళ ప్రాజెక్ట్ లు అయితే ఆమె ఇప్పుడు చేస్తుంది.