టైగర్.. మాస్ రాజా స్ట్రాంగ్ ప్లాన్

మాస్ మహారాజ్ రవితేజ టాలీవుడ్ అందరికంటే వేగంగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఏడాది కనీసం మూడు సినిమాలని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా రావణాసుర మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ కొట్టిన మాస్ రాజా ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు మూవీపై పూర్తిగా ఫోకస్ పెట్టారు.

వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ రియల్ లైఫ్ దొంగకి సంబందించిన బయోపిక్ అనే సంగతి తెలిసిందే. స్టువర్టుపురం దొంగగా ఫేమస్ అయిన టైగర్ నాగేశ్వరరావు నిజ జీవిత కథపై అధ్యయనం చేసి దానిని సినిమాటిక్ లిబర్టీతో సిల్వర్ స్క్రీన్ పై పాన్ ఇండియా రేంజ్ లో ఆవిష్కరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ అవుట్ పుట్ విషయంలో రవితేజ చాలా సంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

మొదటిసారిగా ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో వర్క్ అవుట్ అవుతుందని నమ్మి అన్ని భాషలలో రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. నిజానికి టైర్ 2 హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ కూడా పాన్ ఇండియా బ్రాండ్ కోసం పరుగులు పెడుతున్నారు. అయితే రవితేజ మాత్రం తనకి యాప్ట్ అయ్యే కథలతోనే మూవీస్ చేస్తున్నారు. పాన్ ఇండియా థాట్ కూడా లేదు.

కాని టైగర్ నాగేశ్వరావు క్యారెక్టర్, కథకి యూనివర్శల్ అప్పీల్ ఉండటంతో పాన్ ఇండియా వైపు మొగ్గారంట. ఇక కార్తికేయ 2తో నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవల్ లో హిట్ కొట్టారు. అలాగే ది కాశ్మీర్ ఫైల్స్ మూవీతో ఇండియన్ వైడ్ గా నిర్మాతగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అతని నిర్మాణంలోనే టైగర్ నాగేశ్వరరావు మూవీ వస్తోంది.

ఈ నేపథ్యంలో మార్కెట్ లెక్కలు కరెక్ట్ గా వేసుకోవడంతో ఒక్కో భాషలో ఒక్కో స్టార్ ని ఈ మూవీలో వాయిస్ ఓవర్ కోసం వినియోగించే పనిలో ఉన్నారంట. అలాగే అదే హీరోతో మూవీని కూడా ఆయా భాషలలో మార్కెట్ లోకి రీచ్ అయ్యేలా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల మాట.