టీజర్ టాక్ : ఊహించని లెవెల్లో రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” 

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న పలు పాన్ ఇండియా చిత్రాల్లో అయితే దాదాపు ప్రభాస్ చిత్రాలు అల్లు అర్జున్ అలాగే ఎన్టీఆర్ రామ్ చరణ్ ల సినిమాల పేర్లే వస్తాయి. కానీ వీటితో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా ఓ రేంజ్ లో కన్నేసినట్టుగా ఇప్పుడు తాను చేస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “టైగర్ నాగేశ్వరరావు” తో అనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.

ఇన్ని రోజులు జస్ట్ చిన్న లుక్స్ గ్లింప్స్ వచ్చాయి కానీ ఇపుడు వచ్చిన టీజర్ చూసాక మాత్రం ఓ రేంజ్ లో హైప్ పెరిగింది అని చెప్పడంలో సందేహం లేదు. కాగా ఈ టీజర్ లో విజువల్స్ ని అయితే కొన్నిటిని దర్శకుడు వంశీ ఊహించని లెవెల్లో ప్రెజెంట్ చేయడం పాన్ ఇండియా ఆడియెన్స్ లో క్లిక్ అవుతుంది అనిపిస్తుంది.

ఇక ఈ టీజర్ లో టైగర్ నాగేశ్వరరావు పై ఇచ్చిన ఎలివేషన్స్ అలాగే తన చిన్న నాటి సన్నివేశాలు నటులు మురళి శర్మ మరియు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ లపై సీన్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. ఇలా మొత్తంగా అయితే ఈ టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ట్రీట్ ఇచ్చేలా అనిపిస్తుంది.

దీనితో తెలుగు స్టేట్స్ సహా పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ చిత్రం ఓ బ్లాస్టింగ్ హిట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా ఈ టీజర్ లో సంగీతం అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ నపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రేణు దేశాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
Tiger's Invasion (Telugu) | Tiger Nageswara Rao | Ravi Teja | Vamsee | Abhishek Agarwal Arts