” ఖిలాడి ” గా రవితేజ లేటెస్ట్ మూవీ ప్రీ లుక్ రిలీజ్.. మరో ఇడియట్ అంటున్నారే ..!

Ravi Teja in Khiladi

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “క్రాక్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ కంప్లీటవచ్చింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు. కాగా రవితేజ లేటెస్ట్ అప్‌డేట్ మాస్ ఫ్యాన్స్ కి ఊపునిచ్చింది. “రాక్షసుడు” సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు రమేష్ వర్మ తో రవితేజ నెక్స్ట్ స్నిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఒక ప్రీ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర బృదం.

Image

మాస్ మహారాజ కి సరిగ్గ సరిపోయో “ఖిలాడి” అన్న కిరాక్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ టిటిల్ కి ప్లే స్మార్ట్ అనే ట్యాగ్ లైన్ ఉండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. కాగా ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని సమాచారం. అందులో ఒక క్యారెక్టర్ స్మార్ట్ గా దొంగతనం చేసే క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేయనున్నాడట.

ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్స్ గా నటిస్తుండగా… రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎ స్టూడియోస్ సమర్పణలో పెన్ స్టూడియోస్ – హవిష్ ప్రొడక్షన్ లో కోనేరు సత్యనారాయణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించనుండగా నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ఇక త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో కూడా రవితేజ ఒక సినిమా చేయబోతున్నాడు రవితేజ.