Raviteja: సినీ నటుడు రవితేజ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. నటుడిగా ఈయన కిందిస్థాయి నుంచి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. కెరియర్ మొదట్లో చిన్నచిన్న పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి రవితేజ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు .ఈయన ఒక్కో సినిమాకు సుమారు పాతిక నుంచి 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది.
ఇకపోతే రవితేజ ఒక హిట్ సినిమాలో నటిస్తే సుమారు ఒక అరడజనుకు పైగా ఫ్లాప్ సినిమాలే ఉంటాయి. ఇక రవితేజ పని అయిపోయింది అనుకుంటున్న తరుణంలో మరో హిట్ సినిమా ద్వారా ఫామ్ లోకి వస్తారు. ఇప్పటివరకు ధమాకా సినిమా తర్వాత ఈయన సుమారు నాలుగైదు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
ఇక త్వరలోనే మరోసారి శ్రీలీలతోనే నటిస్తున్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా వరుసగా ఈయన సినిమాలు ఫ్లాప్ అవుతున్న తరుణంలో సినిమాల విషయంలోనూ కథల ఎంపిక విషయంలో రవితేజ అలర్ట్ కాకపోతే ఈయన కెరియర్ పైనే పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు. అయితే రవితేజ గురించి మాత్రం ఒక వార్త ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది.
రవితేజ సినిమా చేయాలి అంటే ఆయనకు కథ నచ్చాల్సిన పనిలేదని కేవలం రెమ్యూనరేషన్ మాత్రం పెంచితే చాలు కథ కూడా వినకుండా సినిమాలకు కమిట్ అవుతారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి నిజంగానే రవితేజ అలా రెమ్యూనరేషన్ పెంచితే కథ వినకుండానే కమిట్ అవుతారా.. లేక ఆయన గురించి ఇలాంటి రూమర్లను ఉద్దేశపూర్వకంగా సృష్టించారా అనేది తెలియదు కానీ ఈయన మాత్రం కథలు ఎంపిక విషయంలో అలర్ట్ అవ్వకపోతే ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని పలువురు భావిస్తున్నారు.