మాస్ మహారాజా రవితేజ గ్రాఫ్ ఎంతగా పడిపోయిందో అందరికీ తెలిసిందే. రాజాది గ్రేట్ తరువాత ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. అన్నీ కూడా డిజాస్టర్లే. వరుసగా సినిమాలు ఫ్లాపులు అవుతున్నా కూడా రవితేజ మాత్రం తన పారితోషికాన్ని తగ్గించుకోవడం లేదని తెలుస్తోంది. రవితేజ ఇప్పుడు క్రాక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మొత్తానికి రవితేజ ఈ చిత్రంపైనే తన ఆశలన్నీ కూడా పెట్టుకున్నాడు.
రవితేజ తో ఓ సినిమా చేయాలని ఫిక్సయ్యాడు మారుతి. యూవీ, గీతా ఆర్ట్స్‌కలిసి ఈ సినిమాని నిర్మించాలని ముందుకొచ్చాయి. అయితే,.. పారితోషికం విషయంలో పేచీ రావడంతో రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. రవితేజ డిమాండ్ చేసినంత పారితోషికం ఇవ్వడానికి ఇష్టం లేక, నిర్మాతలూ లైట్ తీసుకున్నారని తెలుస్తోంది. కానీ మారుతి మాత్రం రవితేజను పట్టుకు రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడట.
`పక్కా కమర్షియల్` అనే టైటిల్ కీ, తాను రాసుకున్న కథకూ… రవితేజనే యాప్ట్ అని ఇప్పటికీ నమ్ముతున్నాడు. అందుకే రవితేజని ఒప్పించే ప్రయత్నాలు మళ్లీ మొదలెట్టాడని టాక్. కావాలంటే తన పారితోషికం కొంత తగ్గించుకుని, అది కాస్త.. రవితేజ పారితోషికంలో కలపడానికి సైతం సిద్ధమయ్యాడు. అయితే.. రవితేజ మాత్రం `12` కోట్ల దగ్గరే ఆగిపోయాడు. మారుతి తన పారితోషికం విషయంలో కాస్త దిగి వచ్చినా, రవితేజకు కావల్సినంత మాత్రం సర్దుబాటు కావడం లేదట. కానీ రవితేజ మరీ ఎందుకు అలా పట్టుబడుతున్నాడో అర్థం కావడం లేదు.