డౌటేముంది.? అన్నయ్యే మెగాస్టార్.!

‘రవితేజ లాంటి చిన్న హీరోతో..’ అంటూ ‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఓ సెక్షన్ మీడియా అనవసరపు రాద్ధాంతం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇంతకీ, ఈ విషయంపై రవితేజ ఏమంటాడు.? ఇంకేమంటాడు.. ‘డౌటేముంది, ఆయన మెగాస్టార్.. ఆయనకి మేం వీరాభిమానులం. తమ్ముడిగా ఆప్యాయత పంచారు. ఆయనెప్పటికీ పెద్ద హీరోనే. మేం చిన్నవాళ్ళమే ఆయన ముందు..’ అన్నాడట.

‘ఆ మాటల వెనుక ఆప్యాయత తప్ప, వేరే యాంగిల్ నాకు కన్పించలేదు’ అని రవితేజ తనతో ‘చిన్న హీరో’ ప్రస్తావన తెచ్చిన ఒకరిద్దరు సినీ ప్రముఖులతో చెప్పాడట.

నడుస్తున్న వివాదంపై చిరంజీవి సైతం రవితేజతో మాట్లాడినట్లు తెలుస్తోంది. రవితేజ హర్టయ్యే పరిస్థితి వుండదుగానీ, రవితేజ అభిమానుల ముసుగులో కొందరు చేస్తున్న యాగీ.. ఈ వివాదానికి కారణమైంది.