రవితేజ కెరీర్ క్లోజ్ అన్నోళ్లకు.. క్రాక్ ఓపెనింగ్స్ దెబ్బ!

మాస్ మహారాజా రవితేజ కెరీర్ క్లోజ్ అయినట్లే అని గత కొంతకాలంగా కొన్ని ట్రోల్స్ అయితే వైరల్ అయ్యాయి. రాజా ది గ్రేట్ సినిమా అనంతరం మాస్ రాజా సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలను అంధించలేదు. ఇక చర్చల్లో ఉన్న సినిమాలు కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు క్రాక్ కలెక్షన్స్ కు ఆ విమర్శకుల నోళ్లు ఒక్కసారిగా మూత పడ్డాయి.

 

క్రాక్ ఓపెనింగ్స్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అసలే 50% లిమిటేషన్స్ తో థియేటర్స్ నడుస్తున్న తరుణంలో క్రాక్ ఊహించని విధంగా సాలీడ్ కలెక్షన్స్ అందుకుంటోంది. మొదటిరోజు రవితేజ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలపై ఒక లుక్కేస్తే.. కిక్ 2 – 5.8కోట్లు. బెంగాల్ టైగర్ – 5.3కోట్లు. పవర్ – 5.15కోట్లు. రాజా ది గ్రేట్ – 4.92కోట్లు. ఇక టచ్‌ చేసి చూడు – 4.15కోట్లు.. అందుకున్నాయి

వాటికంటే ఎక్కువ స్థాయిలో క్రాక్ మంచి ఓపెనింగ్స్ అందుకుంది. శనివారం రెండు షోలు అలాగే ఆదివారం మొత్తం షోలతో కలుపుకొని క్రాక్ కలెక్షన్స్ రూ.6.25కోట్లని తెలుస్తోంది. ఈ రికార్డ్ నెవర్ బిఫోర్ అనేలా ఉండడంతో విమర్శకులు స్ట్రాంగ్ కౌంటర్ తగిలిందని చెప్పవచ్చు. ఇక రానున్న రోజుల్లో థియేటర్స్ సంఖ్య కూడా గట్టిగానే పెరుగుతుంది. మరి మాస్ రాజా అప్పుడు ఇంకా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడతాడో చూడాలి.