ఆదిపురుష్ లో రావణుడికి ఓ ప్రత్యేకత ఉందట !

Saif ali khan to act as lankesh in prabhas adipurush

బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఆదిపురుష్ కూడా ఒకటి. ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు.

రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా రావణుడు అంటే విలన్ అన్నట్లుగా చూపించారు. కాని ఈ సినిమాలో మాత్రం రావణుడిలోని మరో కోణంను చూపించబోతున్నట్లుగా సైఫ్ అలీ ఖాన్ ఆసక్తికర విషయాన్ని వెళ్లడించాడు.

ఇటీవల సైఫ్ ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతీ సినిమాలో రావణుడు అంటే రాక్షసుడిలా భయంకరంగా చూపిస్తారు. కానీ ఈ సినిమాతో కొత్త రామాయణంతో పాటుగా ప్రేక్షకులకు కొత్త రావణుడిని కూడా పరిచయం చేయనున్నారని సైఫ్ చెప్పాడు. సినిమాను 2022 ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక తేదీని కూడా ప్రకటించారు. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. విజువల్ వండర్ గా ఈ సినిమా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో సైఫ్ చెప్పిన ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.