Rashmika:విడుదలకు సిద్ధమైన రష్మిక ఫస్ట్ బాలీవుడ్ మూవీ… ఎప్పుడంటే?

Rashmika:రష్మిక మందన ఇప్పుడు నేషనల్ క్రష్ గా బాగా పాపులర్. ఈ కన్నడ ముద్దు గుమ్మా ఛలో సినిమా తో నాగశౌర్యా సరసన నటించి ఈ సినిమా విజయం తో వెను తిరిగి చూసుకునే పనిలేకుండా అయింది. తర్వాత విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం సినిమా తో నటనకు మంచి మార్కులే తెచ్చుకుంది. తర్వాత వచ్చిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో టాప్ హీరోయిన్ అయిపోయింది.రీసెంట్ గా వచ్చిన పుష్ప తో ఆల్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ డమ్ పెంచుకుంది. తర్వాత వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా తో కూడా అదరగొట్టేసింది.

రష్మిక నటించిన పుష్ప సినిమా ఇప్పటికే హిందీ లో కూడా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. రష్మిక నటించిన మొట్టమొదటి హిందీ డైరెక్టర్ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు.రశ్మిక అంగీకరించిన మొట్టమొదటి స్ట్రయిట్ హిందీ సినిమా ‘మిషన్‌ మజ్ను’ .

1970 సమయంలో పాకిస్తాన్ నడిబొడ్డున జరిగిన ‘రా’ మిషన్ కు సంబంధించిన సంఘటనలతో ఈ సినిమాను సంతాను బాగ్చీ తెరకెక్కిస్తున్నారు.సిద్ధార్థ్‌ మల్హోత్రా, రశ్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.గత యేడాది ఫిబ్రవరి మాసంలో లక్నోలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ యేడాది మే 13న సినిమా విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని జూన్ 10కి వాయిదా వేసినట్టు నిర్మాతలు ప్రకటించారు.  ఇప్పటికే విడుదలైన పుష్ప సినిమాతో ఉత్తరాదిన మంచి మార్కులు కొట్టేసిన రష్మిక,స్ట్రయిట్ హిందీ సినిమా ‘మిషన్‌ మజ్ను’ తో ఉత్తరాది అభిమానులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.