ఆ సినిమాలో రష్మిక ఎమోషన్ తో హైలైట్ అవుతుందట.!

ఇప్పుడు ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం పాన్ ఇండియా సినిమా దగ్గర కూడా మంచి క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మికా మందన్నా కూడా ఒకరు. మరి రష్మికా ఇప్పుడు చేస్తున్న పలు భారీ చిత్రాలు కోసం అందరికీ తెలిసిందే.

వీటితో పాటుగా రీసెంట్ గా ఆమె ఎదుర్కొన్న షాకింగ్ ఇన్సిడెంట్స్ కోసం కూడా తెలుసు. అయినా కూడా తన సినిమాలో బిజీగా ఉన్న ఈ యంగ్ బ్యూటీ నుంచి నెక్స్ట్ రిలీజ్ కి రాబోతున్న భారీ చిత్రమే “ఆనిమల్”. ఇది బాలీవుడ్ ప్రాజెక్ట్ కాగా దర్శకుడు సందీప్ వంగ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో రణబీర్ కపూర్ నటించాడు.

ఇక వీరు బాలయ్య షోలో వచ్చి సందడి కూడా చేయగా ఈ సినిమాలో రష్మిక పెర్ఫామెన్స్ కోసం సినీ వర్గాల్లో ఓ టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో ఉండే హైలైట్స్ లో రష్మికా మందన్న ఎమోషనల్ పెర్ఫామెన్స్ కూడా ఓ బిగ్గెస్ట్ హైలైట్ గా నిలుస్తుందట.

దర్శకుడు సందీప్ వంగ ఆమెకి కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ రాయగా వాటిని రష్మిక తన ఎమోషన్స్ తో పిండేసింది అని అంటున్నారు. మరి అంత రేంజ్ లో ఉందో లేదో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 1 వరకు సినిమా కోసం ఆగాల్సిందే. కాగా ఈ సినిమా ఆరోజున పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.