లేటెస్ట్ : తన డీప్ ఫేక్ వీడియోపై రష్మిక షాకింగ్ పోస్ట్ రియాక్షన్ 

ఇప్పుడు ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం పాన్ ఇండియా సినిమా దగ్గర కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో నటి రష్మికా మందన్నా కూడా ఒకరు. ఇప్పుడు పుష్ప 2 లాంటి భారీ చిత్రం సహా బాలీవుడ్ లో “ఆనిమల్” సినిమా రిలీజ్ తో సిద్ధంగా ఉన్న రష్మిక ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది.

అయితే కొంచెం పచ్చిగా చెప్పుకోవాలి అంటే ఒక్క రష్మికా అనే కాదు అన్ని ఇండస్ట్రీ లలో హీరోయిన్స్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ లు ఫోటోలు వీడియోలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే అలాంటిదే ఈ మధ్య కాలంలో వరల్డ్ వైడ్ గా వైరల్ అయిపోయిన డీప్ ఫేక్ ఇంటెలిజెన్స్ కోసం కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది.

దీని సాయంతో ఒకరి మొహాన్ని తీసేసి మరొకరి మొహాన్ని అయితే పెట్టేసి పలు పోర్న్ వీడియోస్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ తరహా లోనే రష్మికా మందన్న పై ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారిపోయింది. కాగా ఈ వీడియో పట్ల రష్మిక ఇప్పుడు పోస్ట్ పెట్టి స్పందించడం జరిగింది.

కాగా నేను ఇప్పుడే ఆ డీప్ ఫేక్ కోసం తెలిసింది అని అందులో ఉన్నది అసలు నేను కాదు అని దానితో నేను చాలా హర్ట్ అయ్యాను అని ఆమె తెలిపింది. టెక్నాలజీ యూజ్ చేసి ఇలాంటి అనర్ధాలు చేస్తున్నారు అని నేను ఒక ఫేమ్ ఉండి హీరోయిన్ కాబట్టి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా రక్షణగా ఉంటారు కాబట్టి సరిపోయింది..

కానీ ఇది నా చిన్న ఏజ్ లో స్కూల్ లేదా కాలేజ్ టైం లో జరిగి ఉంటే అసలు దానిని అసలు ఊహించుకోలేను ఖచ్చితంగా ఇది అందరూ ఖండించాల్సిన విషయం నాలా ఇంకెవరు ఎఫెక్ట్ అవ్వకూడదు అని కోరుకుంటున్నాను అని రష్మిక తెలియజేసి సైబర్ క్రైమ్ హైదరాబాద్, ముంబై పోలీస్ కి ట్యాగ్ చేసి తెలిపింది. దీనితో రష్మిక పోస్ట్ ఇప్పుడు వీడియో వైరల్ గా మారింది.