ఓవర్ యాక్షన్ అనిపిస్తే క్షమించండి.. రష్మిక మందాన్న వీడియో వైరల్

ఛలో బ్యూటీ రష్మిక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. తెరపై ఎంత సందడిగా ఉంటుందో.. రియల్ లైఫ్‌లోనూ అంతే సరదాగా ఉంటుంది. సోషల్ మీడియాలో రష్మిక షేర్ చేసే ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అసలే ఈ మధ్య వర్కౌట్లు చేస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తూ దుమ్ములేపుతోంది. బీచ్‌లో మొదటి సారి వర్కౌట్లు చేశానని, ఆ అనుభవం ఎంతో బాగుందని చెప్పుకొచ్చింది.

Rashmika Mandanna Shares Workout Video
Rashmika Mandanna Shares Workout Video

తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్‌లా, భద్రాచలం సినిమాలో శ్రీహరిలా తెగ వర్కవుట్లు చేసింది. ఇసుకలో పరిగెత్తుతూ, బరువులు మోస్తూ చేసిన కసరత్తులు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా ఈ మధ్య రాశీ ఖన్నాతో కలిసి కూడా జిమ్‌లో వ్యాయామం చేసింది. ఇలా రోజుకో వర్కౌట్ వీడియోను షేర్ చేస్తూ రష్మిక రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా తన భుజంపై ఓ పక్షి వాలడం, దాన్ని తదేకంగా తీక్షణంగా చూడటం ఇదంతా వీడియో తీసి షేర్ చేయడంతో తెగ వైరల్ అయింది.

Rashmika Mandanna Shares Workout Video
Rashmika Mandanna Shares Workout Video

రష్మిక ప్రస్తుతం మరో వర్కవుట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో రష్మిక వేరే లెవెల్‌లో వర్కౌట్ చేస్తోంది. ఇది గనుక ఓవర్ అనిపిస్తే క్షమించండి అంటూ చెప్పేసింది. తాజాగా రష్మిక తన కోలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన మూవీ షూటింగ్ పూర్తైంది. కార్తీ హీరోగా సుల్తాన్ అనే చిత్రంతో తమిళ పరిశ్రమలోకి నేరుగా ఎంట్రీ ఇవ్వబోతోంది. రీసెంట్‌గానే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. ఇక రష్మిక నెక్స్ట్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో జాయిన్ కావాల్సి ఉంది.