ఒక్కో సినిమాకు 4 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న రష్మిక.. సై అంటున్న నిర్మాతలు?

నేషనల్ క్రష్ రష్మిక రోజురోజుకు విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.ఈమె కేవలం కన్నడ తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా హిందీ భాషలో కూడా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ విధంగా పలు భాషా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె వర్ష సినిమా షూటింగ్ లతో కూడా బిజీబిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం అన్ని భాషలలో కూడా దర్శక నిర్మాతలకు రష్మిక ఒక ఆప్షన్ అయ్యారు. ఇలా ఈమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో అవకాశాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి.

మొన్నటి వరకు కేవలం దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఈమె పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందారు. ఈ సినిమా అనంతరం ఈమెకు వరుసగా బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి. ఇప్పటికే మూడు బాలీవుడ్ సినిమాలకు కమిట్ అయిన ఈమె రెమ్యూనరేషన్ విషయంలో కూడా నిర్మాతలను భారీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో ఒక్కో సినిమాకు మూడు కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రష్మిక బాలీవుడ్ సినిమాలకు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది. ఈ విధంగా ఈమె నాలుగు కోట్లు డిమాండ్ చేసినప్పటికీ బాలీవుడ్ నిర్మాతలు సైతం ఏ మాత్రం అడ్డు చెప్పకుండా తాను అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో రష్మిక ఒకరని చెప్పాలి.