ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.ఇక ఈ సినిమా అనంతరం ఈమె త్వరలోనే ఈ సినిమా సీక్వెల్లో బిజీ కానున్నారు. ఇక హిందీలో ఈమె నటించిన గుడ్ బై సినిమా కూడా డిజాస్టర్ కావడంతో హిందీలో కూడా ఎలాంటి అవకాశాలు రాలేదు. ఇక తెలుగులో పుష్ప సినిమా మినహా ఎలాంటి సినిమాలకు కమిట్ అవలేదు.
ఇక తమిళంలో కూడా ఈమె నటించిన వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అయితే రష్మిక ఈ మధ్యకాలంలో వరుస వివాదాలను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే.ఇలా వరుస వివాదాలలో వార్తల్లో ఉన్నటువంటి ఈమెను టాలీవుడ్ ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారని అందుకే తనకు అవకాశాలు కూడా రావడం లేదని వార్తలు వినబడుతున్నాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మికను తొక్కేస్తున్నది ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే. .
టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక తనకు ఒక మంచి హిట్ సినిమా పడగానే ఆమే మాత్రం తన రెమ్యూనరేషన్ పెంచేశారు. ఇలా రెమ్యూనరేషన్ పెంచడంతో ఈమె అడిగిన మొత్తం ఇవ్వలేక దర్శక నిర్మాతలు తనకు అవకాశాలు లేకుండా, ఆమె స్థానంలో ఇతరులకు అవకాశాలు కల్పిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా రష్మిక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర సినిమాలకు కమిట్ అవ్వలేదని సమాచారం. అయితే ఈమె పెంచిన రెమ్యూనరేషన్ తనకు అవకాశాలు లేకుండా చేస్తుందని తెలుస్తుంది.