వైరల్ : తనని బ్యాన్ చేయడంపై రష్మికా హాట్ కామెంట్స్.!

ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ రష్మికా మందన్నా ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. మరి ఇప్పుడు రష్మికా అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయి పలు భారీ చిత్రాలు చేస్తుంది.

అయితే నిజానికి రష్మికా మందన్నా నేటివ్ ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ అని అందరికీ తెలిసిందే. కానీ ఈ ఇండస్ట్రీ నుంచే రష్మికా అయితే బ్యాన్ ని ఎదుర్కోవడం ఆసక్తిగా మారింది. ఆమెని బ్యాన్ చెయ్యడం అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడవగా తాజాగా అయితే ఈ ట్రోల్స్ పై ఆమె కొన్ని హాట్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది.

తాను ఈ ట్రోల్స్ పై సీరియస్ గా కానీ తన మానసికంగా కానీ దగ్గరకు తీసుకొని ఆలోచించలేదు అని అలాగే కన్నడ ఇండస్ట్రీలో నన్ను బ్యాన్ చేసారు అనే మాట పూర్తిగా అవాస్తవం అని తేల్చి చెప్పేసింది. అవన్నీ పుకార్లు మాత్రమే అని ఈ రూమర్స్ పై అయితే ఓ బిగ్ క్లారిటీ ఇచ్చినట్టుగా సినీ వర్గాల్లో ఇప్పుడు బయట వచ్చింది.

ఇక ప్రస్తుతం రష్మికా అయితే పలు హిందీ సినిమాలు సహా తన అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2 చేయనుంది. అలాగే తమిళ చిత్రం వారసుడు కూడా చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది. రీసెంట్ గా అయ్యితే పుష్ప రష్యా రిలీజ్ కి గాను అక్కడికి వెళ్లి మరీ ప్రమోట్ చేసింది.