Rashmika: ఎయిర్ పోర్ట్ లో ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన రష్మిక…. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్?

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వీరి ప్రేమ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ విషయాన్ని కూడా వీరిద్దరూ దాదాపు ఒప్పుకున్నారని చెప్పాలి. ఇకపోతే ఇటీవల పుష్ప 2 సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె విజయ్ దేవరకొండతో కలిసి మరోసారి కనిపించడంతో వీరి గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఇస్తున్నటువంటి పార్టీ కోసం విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కలిసి ఒకే ఫ్లైట్ లో వెళ్లారని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరూ ఒకరి తర్వాత మరొకరు కనిపించే సందడి చేశారు అదేవిధంగా విజయ్ దేవరకొండ తిరిగి రష్మిక వద్ద ఉన్నటువంటి క్యాప్ పెట్టుకొని కనిపించడంతో వీరిద్దరూ కలిసే ముంబై వెళ్లారని తెలుస్తుంది.

ఇలా వీరిద్దరూ కలిసి ముంబైలో పెద్ద ఎత్తున పార్టీలో పాల్గొని సందడి చేస్తున్నారు అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ అభిమానులు అలాగే నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పుష్ప 2 సినిమా తొక్కిసలాట ఘటన సమయంలో అల్లు అర్జున్ తో పాటు రష్మిక కూడా అక్కడే ఉన్నారు అయితే ఈ కేసులో అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ ఆయనని అరెస్టు చేయడం అనంతరం విచారణ పేరుతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు ఇలా అల్లు అర్జున్ మంచి సక్సెస్ అందుకున్న ఏమాత్రం ఆ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు.

ఇక ఈ సినిమాలో నటించిన రష్మిక మందన్న మాత్రం తన ప్రియుడుతో కలిసి పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్నారని అసలు మీకు కొంచమైనా మానవత్వం ఉందా అసలు మీరు మనిషేనా అంటూ పలువురు అల్లు అర్జున్ అభిమానులు రష్మిక వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ మాత్రం ఇండస్ట్రీ బిగ్ హిట్ అందుకున్న కూడా తన సంతోషాన్ని బయటకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి.